- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భక్తి పేరుతో బాదుతున్న పూజారి..
దిశ,పాలకుర్తి : పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ్మస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్బగుడిలో దేవుడిని దర్శించుకొని వెళ్తున్న భక్తులను కట్టెతో భుజలపై కొడుతూ దేవుడి కట్టె అంటున్నాడు పూజారి. దేవుడికి కానుకలు సమర్పించండి అనకుండా అయ్యగారికి కానుకలివ్వండి అంటున్నాడు.
అలాగే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకొని, దర్శించుకునే క్రమంలో భక్తులు అడుగుడున నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కరోన నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్వవహరిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజున ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముఖ ద్వారం మొదలుకొని గర్భగుడి వరకు భక్తులు భౌతికదూరం,మాస్క్ లు ధరించకుండా గుంపులుగుంపులుగా వెళ్లుతున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్నపోలీసులు సైతం మాస్క్ లు ధరించడం లేదు. అదికాకుండ క్యూ లైన్ లోవస్తున్న భక్తులకు మాస్క్ లు లేకుండా ఎదురుగా వస్తున్నారు.
గర్భగుడిలో భక్తలు మాస్క్ లు లేకుండానే తోసుకుంటూ వెళ్తున్నారు. తలనీలాలు తీసేకాడ మాస్క్ లు ధరించకుండనే తలనీలాలు తీస్తున్నారు. ఆలయ సూపరిండెంట్ మాస్క్ ధరించకుండ భక్తుల నడుమ విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక దర్శనం వద్ద,కాంట్రక్ట్ పొందిన వ్వక్తి మాస్క్ లేకుండ టికెట్స్ సేకరిస్తున్నారు. వైద్య శిబిరంలో ఉదయం విధులు నిర్వహించిన ఎఎన్ఎమ్ భక్తులకు శానిటైజర్ పోయడం లేదు కనీసం మాస్క్ లు ధరించమని చెప్పకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. కొబ్బరి కాయలు,పూజ సామాగ్రి విక్రయ కేంద్రాల వద్ద కూడా మాస్క్ లు ధరించడంలేదు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వేలాది మంది తరలివచ్చే అవకాశం ఉంది. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉందని భక్తులు అంటున్నారు.