- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ పోలీసుకు బాధ్యత లేదా.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..!
దిశ, సిద్దిపేట: సాధారణంగా వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడిపినా.. హెల్‌మెట్ లేని ప్రయాణం చేసినా, త్రీబుల్ రైడింగ్ చేసినా.. రాంగ్ రూట్‌లో వెళ్లినా.. అతి వేగంతో బైక్ నడిపి పోలీస్ అధికారులకు చిక్కితే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. బ్రహ్మదేవుడు దిగి వచ్చిన వదిలిపెట్టారు. వేలాది రూపాయలు పెనాల్టీ విధిస్తారు. అటువంటి పోలీస్ అధికారులు వాహనదారులకు ఆదర్శంగా ఉండాలి. కానీ సిద్దిపేట పట్టణంలో ఓ పోలీస్ అధికారి అసలే రాంగ్‌రూట్ ఆపైన సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బైక్ నడిపిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సామాన్య జనాలకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే తూచా తప్పకుండా చలాన్ విధిస్తే.. మరి ఈ అధికారికి ఏ స్థాయిలో ఫైన్ వేస్తారో అంటూ చర్చించుకుంటున్నారు. బాధ్యతగల పోలీసు ఉద్యోగంలో ఉండి ఇలా బైక్ డ్రైవింగ్ చేసి సామాన్య ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.