కిడ్నాప్ కలకలం..

by srinivas |
కిడ్నాప్ కలకలం..
X

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బాలుడి కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం స‌ృష్టించింది. విశాఖలోని భీమిలి బీచ్‌లో ఆడుకుంటున్నలోకేశ్ అనే బాలుడిని కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు.వారంరోజులుగా చిత్రహింసలకు గురిచేశారని బాలుడి తల్లి వరలక్ష్మీఆవేదన వ్యక్తంచేశారు.తనకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని కోరారని, పోలీసులకు చెబితే తనకొడుకు చంపేస్తామని బెదిరించారని తెలిపింది. ఏం చేయాలో తెలియక భయాందోళనకు గురయ్యారని ఆమె చెప్పుకొచ్చారు.చివరకు చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించానన్నారు. విషయం తెలుసుకున్నకిడ్నాపర్లు ఎక్కడ దొరికిపోతాననే భయంతో బాలుడిని భీమవరంలో వదిలిపెట్టి పరారయ్యారు. లోకేశ్‌ను వారం రోజులుగా చిత్రహింసలకు గురిచేయడంతో ఆస్పత్రిలో చేర్పించారు. కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story