గౌస్ కోసం పోలీసుల వేట

by Sumithra |
గౌస్ కోసం పోలీసుల వేట
X

దిశ, మహబూబ్ నగర్: ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన మత ప్రచార సభకు వెళ్లొచ్చిన గౌస్ అనే వ్యక్తి.. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉండకుండా ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నాడు. మక్తల్ పట్టణానికి చెందిన ఈయనకు పోలీసులు ఫోన్ చేస్తే వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు సమాధానమిస్తున్నాడు. డిల్లీ వెళ్లొచ్చిన చాలామందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న గౌస్.. పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నట్టు సమాచారం. దీంతో ఆయన ఫోన్ నెంబర్‌ను ట్రేస్ చేసి, పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

Tags: corona, virus, gouse, delhi, tracing, home quarantine,

Advertisement

Next Story