- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అతని కోసం బాలీవుడ్ హీరో ఇంట్లో తనిఖీలు
దిశ, వెబ్ డెస్క్: శాండల్‌వుడ్ డ్రగ్ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీలో మాదక ద్రవ్యాల కేసులో 12 మంది ప్రధాన నిందితుల్లో వివేక్ ఒబెరాయ్ బంధువు, కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా ఒకరు.
ఈ కేసు దర్యాప్తు మొదలైనప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారని, వివేక్ ఒబెరాయ్ ఇంట్లో తలదాచుకున్నట్టు అందిన సమాచారం మేరకు ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నట్టు బెంగలూరు సెంట్రల క్రైం బ్రాంచ్ వెల్లడించింది. కోర్టు నుంచి వారెంట్ తీసుకుని ముంబయిలోని వివేక్ ఇంటిలో సోదాలు చేస్తున్నట్టు తెలిపింది.
ఒబెరాయ్ నివాసంలో మధ్యాహ్నం సుమారుగా ఒంటిగంటకు మొదలైన తనిఖీలు దాదాపు రెండున్నర గంటలపాటు సాగింది. ఈ డ్రగ్ కేసులో ఇప్పటికి రాగిణి ద్వివేది, సంజన గల్రానిలు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగనున్నారు.