- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరిహద్దుల్లో కోడి పందాలు.. భారీగా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
దిశ, ములకలపల్లి: ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతంలో కొందరు పందెం రాయుళ్లు పెద్ద మొత్తంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ పందేల్లో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు తెలంగాణ ప్రాంతం వారితో కలిసి ఈ పందేలకు నాయకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ వ్యవహారం సాగుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించారు. విశ్వసనీయ సమాచారంతో గురువారం స్థావరాలపై పెద్ద సంఖ్యలో పోలీసులు దాడిచేశారు. దీనితో నిర్వాహకులు అక్కడినుంచి జారుకున్నారు.
పందేల్లో పాల్గొనేందుకు వచ్చిన వారి మోటారు సైకిళ్లు, కోడి పుంజులు పెద్ద సంఖ్యలో పట్టుపడ్డాయి. ములకలపల్లి మండలం, మంగలిగుట్ట గ్రామ శివారు ఆంధ్రా సరిహద్దులో గత కొద్ది రోజులుగా కోడి పందేలా నిర్వహణ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పాల్వంచ-ములకలపల్లి పోలీసులు సంయుక్తంగా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 46 మోటారు సైకిళ్లు, 15 కోడిపుంజులు, ఆరుగురు పందెం రాయుళ్ల తో పాటు రూ. 14970 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.