8 నిమిషాల్లో యువతిని కాపాడిన దిశ యాప్

by srinivas |
8 నిమిషాల్లో యువతిని కాపాడిన దిశ యాప్
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దిశ పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మహిళా రక్షణే లక్ష్యంగా ఈ పోలీస్ స్టేషన్లు పని చేస్తాయి. పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే క్షణాల్లో మీముందుంటామని పోలీసులు ప్రకటించారు కూడాను. ఈ యాప్ తాజాగా ఒక యువతిని ఆపద నుంచి రక్షించింది.

కృష్ణా జిల్లా కొల్లేటి కోట సమీపంలో తాను ఆపదలో ఉన్నానని గ్రహించిన ఓ యువతి, దిశ యాప్‌ను ఆశ్రయించగా కేవలం ఎనిమిది నిమిషాల్లో పోలీసులు ఆమెను ట్రేస్ చేసి ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి కాపాడి శభాష్ అనిపించుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… కొల్లేటి కోట సమీపంలో ఆటో ఎక్కిన యువతికి ఆ ఆటో డ్రైవర్ కూల్‌డ్రింక్‌ను ఆఫర్ చేశాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఉంటాడని అనుమానించిన సదరు మహిళ.. తన మొబైల్‌లోని దిశ యాప్ ద్వారా పోలీసులను కాంటాక్ట్ చేసింది.

దిశ యాప్‌లో ఎస్ఓఎస్ ఆప్షన్ ద్వారా సమాచారాన్ని అందుకున్న విజయవాడ కంట్రోల్ రూమ్ అధికారులు, వెంటనే కొల్లేటికోట పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెకు కాల్ కూడా చేయకుండా స్మార్ట్ ఫోన్ లొకేషన్ సిగ్నల్స్ ఆధారంగా ఆటోను ట్రేస్ చేశారు. ఆటోను నడిపిస్తున్న పెద్దిరాజు అనే యువకుడిని అడ్డుున్నారు.

ఇదంతా కేవలం 8 నిమిషాల్లోనే జరగడం విశేషం. అయితే బాధితురాలు ఊహించినట్టుగానే, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపానని పెద్దిరాజు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Tags: disha app, police protection, girl saved disha app, auto driver arrested, vijayawada, drug mixed cool drink

Advertisement

Next Story