సల్మాన్‌ఖాన్ హత్యకు గ్యాంగ్‌స్టర్స్ కుట్ర

by Shamantha N |   ( Updated:2020-08-18 12:13:53.0  )
సల్మాన్‌ఖాన్ హత్యకు గ్యాంగ్‌స్టర్స్ కుట్ర
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌‌ హత్యకు కుట్ర పన్నిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠాలోని పలువురిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సల్మాన్‌‌ఖాన్‌ను చంపే బాధ్యతను లారెన్స్ బిష్ణోయ్.. రాహుల్‌కు అప్పగించగా అతడు జనవరిలో ముంబై వెళ్లి బాంద్రాలోని సల్మాన్‌ఖాన్ ఇంటి దగ్గర మూడ్రోజులు రెక్కీ నిర్వహించాడు.

ఇదేక్రమంలో ఫరీదాబాద్‌లో ఓ యువకుడి హత్యపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు జూన్ 24న రాహుల్ ఇంటికి చేరుకున్నారు. ప్రవీణ్ అనే యువకుడిని రాహుల్ చంపగా.. అతనితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులు రాహుల్‌ను ప్రశ్నించినప్పుడు.. సల్మాన్‌‌ఖాన్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు తేలింది. హత్యకు రెక్కీ నిర్వహించేందుకు ముంబై వెళ్లడానికి జోధ్‌పూర్ జైలులో ఉన్న నేరగాడు లారెన్స్ బిష్ణోయ్.. తనకు సుపారీ ఇచ్చారని ఒప్పుకున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed