తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌లోనే ఏఎస్సైపై కేసు నమోదు

by Sumithra |   ( Updated:2021-12-25 21:20:21.0  )
Mumbai-Police1
X

దిశ, వెబ్ డెస్క్: తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే ఏఎస్సైపై ఫిర్యాదు వచ్చింది. దీంతో పోలీసులు వాస్తవ పరిస్థితులను పరిశీలించి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వకోలా ప్రాంతంలో స్వాగత్ రెస్టారెంట్ ఉంది. రోజూ మాదిరిగానే రాత్రి అయినంక రెస్టారెంట్ ను మూసివేశారు. దీంతో సిబ్బంది కూడా ఒక్కక్కరూ తమ ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో ఏఎస్సై విక్రమ్ పాటిల్ పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చాడు. అనంతరం తమకు ఉచితంగా భోజనం, మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు రెస్టారెంట్ వారు నిరాకరించారు. దీంతో వెంటనే క్యాషియర్ పై ఆ ఏఎస్సై దుర్భాషలాడుతూ దాడి చేశాడు. దీంతో ఆ రెస్టారెంట్ ఓనర్ ఏఎస్సై పని చేస్తున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను వారికి అందించాడు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Advertisement

Next Story