- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లగొండ జిల్లాలో చిరుత దాడి
దిశ, నల్లగొండ: జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. పంట రక్షణ కోసం వేసిన వలలో చిక్కుకున్న చిరుతను బంధించేందుకు వెళ్లిన పోలీసులపై పంజా విసిరింది. దీంతో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మర్రిగూడ మండలం రాజాపేటతండాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజాపేటతండా శివారులో కొద్దిరోజులుగా పలుమార్లు చిరుతలు సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పంటలను కాపాడుకోవడానికి పొలాల చుట్టు వలలను వేస్తున్నారు. ఈ క్రమంలోని ఓ రైతు వేసిన వలలో చిరుత చిక్కుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతను బంధించే క్రమంలో ఉచ్చు నుంచి తప్పించుకుని పోలీసులపై దాడి చేసింది. ఎట్టకేలకు చిరుతను పట్టుకున్నారు. అనంతరం చిరుతను హైదరాబాద్ జూపార్కుకు తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ చిరుత అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందినగా అధికారులు గుర్తించారు.