- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉధృతంగా వాగు.. గర్భిణికి అండగా పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గ్రామాలకు మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిండు గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతూ వాగు దాటలేక సహాయం కోసం దీనంగా ఎదురుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు ప్రాణాలకు తెగించి గర్భిణిని ఆస్పత్రిలో చేర్చి తమ సహృదయతను చాటుకున్నారు.
వివరాల్లోకివెళిలే.. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం సూపాక గ్రామానికి చెందిన శ్రీలత అనే మహిళ ప్రసవ వేదనతో బాధపడుతోంది. దవాఖానకు వెళ్తేందుకు బయలు దేరగా.. ఎదుల్లబందం సమీపంలో తుంతుంగా చెరువు ఉధృంతంగా ప్రవహిస్తుండటంతో వార అక్కడే ఆగిపోయారు. విషయం తెలుసుకున్న చెన్నూరు రూరల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్ఐ ఘటనాస్థలికి చేరుకున్నారు. ట్రాక్టర్ సాయంతో గర్భిణిని వాగు దాటించారు.
అంతకుముందు, వరద ప్రవాహం కారణంగా సుమారుగా 2గంటల పాటు గర్భిణి అక్కడే ఉండిపోయింది. సీఐ, ఎస్ఐలు మానవతా ధృక్పదంతో ఆలోచించి ప్రమాదకర పరిస్థితిలో కూడా గర్భిణిని సురక్షితంగా తీసుకొచ్చి చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. విపత్కర సమయంలో సరైన సమయంలో స్పందించిన సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్, స్థానిక ఎంపీటీసీ జేక శేఖర్‌లను పలువురు అభినందించారు.