- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటి అనుపమతో గ్రాండ్‌గా షోరూం ఓపెనింగ్.. షాకిచ్చిన పోలీసులు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : హంగు ఆర్భాటాలు, సినీతార, రాజకీయ నాయకులు, డీజే సౌండ్ సిస్టం, ఆర్కెస్ట్రా, సినీ అభిమానుల మధ్య గురువారం నిర్మల్‌లో నూతన కిసాన్ క్లాత్ షోరూం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం వివాదాలకు దారి తీసింది. నిబంధనలు పాటించలేదని యజమానులపై నిర్మల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో జూనియర్ కాలేజ్ ఎదురుగా కొత్తగా వెలిసిన కిసాన్ క్లాత్ షోరూంను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు సినీ తార అనుపమ పరమేశ్వరన్ ముఖ్య అతిథిగా హాజరై షో రూమ్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అయితే, స్థానిక మంత్రి ఈ కార్యక్రమానికి ఉదయం పూటనే హాజరై వెళ్ళిపోయారు.
ముఖ్య అతిథిగా హాజరైన సినీనటి అనుపమ పరమేశ్వరన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కానీ ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు కూడా షోరూం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిని బ్లాక్ చేసి రోడ్డుపైన డీజే సిస్టం, బారికేడ్లు ఏర్పాటు చేసి హీరోయిన్‌తో స్టేజీ షో నిర్వహించారు. సుమారు రెండు గంటలు రోడ్డును బ్లాక్ చేసి కార్యక్రమం కొనసాగించడంతో రహదారిపై వెళ్లే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు నిర్మల్ పట్టణంలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున ఎలాంటి బహిరంగ సమావేశాలు, సభలు నిర్వహించడానికి అనుమతి లేదని స్థానిక పట్టణ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో యజమాని సూర్యనారాయణ, మేనేజర్ హరీష్‌పై కేసు నమోదు చేశారు. ఓవైపు కొవిడ్ నిబంధనలు పాటించకుండా నడిరోడ్డుపై కార్యక్రమం నిర్వహించడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.