అవ్వా నేను రైతు బిడ్డ‌నే.. పొలం పనుల్లో పోలీసు

by Shyam |   ( Updated:2021-07-05 01:35:25.0  )
అవ్వా నేను రైతు బిడ్డ‌నే..  పొలం  పనుల్లో పోలీసు
X

దిశ‌, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ : ప‌త్తి చేనులో ప‌నిచేస్తున్న కూలీల‌ను చూడగానే ఆ పోలీసు అధికారి కాళ్లు అప్రయ‌త్నంగానే వారి వైపు క‌దిలాయి. పోలీస్ అధికారి త‌మై వైపు వ‌స్తున్న విష‌యాన్ని గ‌మ‌నించిన ఆ కూలీలు భ‌యంతో వ‌ణికిపోయారు. సార్ ఎందుకు వ‌స్తున్నారంటూ ఒక‌రి వైపు ఒక‌రు చూసుకున్నారు. కూలీల ముఖంలో భ‌యాందోళ‌న‌ను గ‌మ‌నించిన ఆ అధికారి అవ్వ భ‌య‌ప‌డ‌కండి, ఊరిక‌నే వ‌చ్చాను.. మిమ్మల్ని చూడగానే పొలం ప‌నులు చేసే మా అమ్మనాన్నలు గుర్తుకు వ‌చ్చారంటూ తెల‌ప‌డంతో కూలీలు సంబ్రమాశ్చర్యాల‌కు లోన‌య్యారు.

జనగాం రూరల్ సీఐగా విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ లింగాల ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ను సోమవారం సందర్శించారు. తిరిగి వస్తున్న క్రమంలో కుందారం గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో పోలం పనులు నిర్వహిస్తున్న మ‌హిళా కూలీలు పొలంలో ప‌త్తి మొక్కల‌కు యూరియా మందు వేస్తూ క‌నిపించారు. కొద్దిసేపు వారితో పొలం ప‌నులు చేసిన సీఐ వారి క‌ష్ట సుఖాల‌ను తెలుసుకోవ‌డం గ‌మ‌నార్హం. పోలీస్ అధికారి తమతో కలసి పోలం పనులు నిర్వహించడం పట్ల సదరు పనులు చేస్తున్న రైతులు ఆనంద ప‌డ్డారు.

Advertisement

Next Story

Most Viewed