పెనుమూరు పీఎస్‌లో మైనర్ బాలుడి నిర్బంధం

by srinivas |
పెనుమూరు పీఎస్‌లో మైనర్ బాలుడి నిర్బంధం
X

దిశ, వెబ్ డెస్క్: పెను‌మూరు పీఎస్‌లో మైనర్ బాలుడిని పోలీసులు నిర్బంధించారు. ఓ ప్రేమ వివాహం విషయంలో బాలుడిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ నిమిత్తం సదరు మైనర్ బాలుడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ బాబు అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా ఢిల్లీ బాబు ఆచూకీ తెలపాలంటూ చిన్నారిని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు. తమ బిడ్డను చిత్ర హింసలు పెడుతున్నారంటూ బాలుడి తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story