హైటెక్ సెక్స్ రాకెట్: నగ్న వీడియోలతో వల.. విమానంలో వచ్చి మరీ

by Anukaran |   ( Updated:2021-08-20 23:02:36.0  )
హైటెక్ సెక్స్ రాకెట్: నగ్న వీడియోలతో వల.. విమానంలో వచ్చి మరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో రోజుకో సెక్స్ రాకెట్ బయటపడుతోంది. ముంబైలో రాజ్ కుంద్రా కేసు వెలుగులోకి వచ్చాకా పోలీసులు ఈ దందాలపై నిఘా పెట్టడంతో రోజుకో సెక్స్ రాకెట్ బయటపడుతుంది. తాజాగా హైటెక్ వ్యభిచారం నడుపుతున్న ఒక ముఠాను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బీహార్ అనగానే.. వలస బతుకులు, తిండి కూడా దొరకని ప్రదేశం అనే ఆలోచనే వస్తుంది. కానీ ఆ ముఠా ఆసరాగా తీసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా రాజధాని పాట్నాలోని ఎగ్జిబిషన్ రోడ్డులో ఉన్న దయాల్ హోటల్ లో వ్యభిచారానికి తెరలేపారు. డబ్బున్న యువకులనే టార్గెట్ గా చేసి ఈ దందా నడుపుతుంది. హైటెక్ గర్ల్స్ పేరుతో ఒక యాప్ ని క్రియేట్ చేసి.. వారి కళ్లను ఫోటోలను తీసి యువకులకు పంపుతారు.

వారు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే.. దయాల్ హోటల్ లో రూమ్ బుక్ అయినట్లే. ఇక డీల్ కుదిరితే బెంగాల్ నుంచి అమ్మాయిలు ఫ్లైట్‌లో పాట్నా వస్తారు. పనైపోయాక.. డబ్బు తీసుకొని.. మళ్లీ బెంగాల్‌కి వెళ్లిపోతారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. ఇందులో విటులతో పని లేదు. అంతా ఆన్ లైన్ లోనే.. ఇక ఈ హోటల్ లో కేవలం వీటి కోసమే 10 గదులు ప్రత్యేకంగా కేటాయించారంటే ఏ లెవెల్లో దందా చేస్తున్నారో అర్ధమవుతుంది. ఇక శుక్రవారం పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ పై సడెన్ రైడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ దాడిలో హోటల్ మేనేజర్, నిర్వాహకులు, విటులు ఇలా మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 8 మంది అమ్మాయిలుండగా.. ఏడుగురు పశ్చిమ బెంగాల్‌కి చెందిన వారు కాగా ఒక యువతి బెనారస్ నుంచి వచ్చిందని తెలుస్తోంది. వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్స్, మొబైల్స్, లిక్కర్ బాటిల్స్, సెక్స్ సమయంలో వాడే మరికొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌ట్యాపుల్లో చాలా మంది అమ్మాయిల న్యూడ్, ఎరోటిక్, ఎక్స్‌పోజింగ్ ఫొటోలు ఉన్నాయి. కొన్ని వీడియోలు ఉన్నాయి. కరోనా తరువాత డబ్బు లేక, ఆర్థికంగా చితికిపోయిన అమ్మాయిలకు డబ్బు ఎరచూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు ఈ ముఠా. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed