వీళ్లు మనుషులేనా.. మాస్క్ పెట్టుకోలేదని మహిళను.. నడిరోడ్డుపై ఆపి

by Anukaran |   ( Updated:2021-05-20 06:45:00.0  )
వీళ్లు మనుషులేనా.. మాస్క్ పెట్టుకోలేదని మహిళను.. నడిరోడ్డుపై ఆపి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశంలో విలయతాండవం చేస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. కరోనా కట్టడి భాగంలోనే అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. ఇక ఈ సమయంలో పోలీసులు కొన్నిచోట్ల అమానుషంగా ప్రవరిస్తున్నారు. తాజాగా ఓ మహిళ మాస్క్ పెట్టుకోకుండా రోడ్డుమీదకు వచ్చిందని పోలీసులు ఆమెపై విరుచుకుపడ్డారు. మహిళ అని కానీ, అది నడిరోడ్డు అని కానీ చూడకుండా మహిళపై దారుణంగా దాడి చేశారు. కాళ్ళతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దుతూ మహిళపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే..

మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఓ మహిళ తన కుమార్తెతో కలిసి సరుకులు తేవడానికి రోడ్డు మీదకు వచ్చింది. అయితే బయటికి వచ్చేటప్పుడు మహిళ మాస్క్ ధరించలేదు. స్కూటీ మీద వస్తున్న ఆ తల్లీకూతుళ్లను విధులు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకున్నారు. మహిళను మాస్క్ ఎక్కడ.? అని ప్రశ్నించారు. ఆమె ఇంటివద్ద మర్చిపోయానని సమాధానం ఇచ్చేలోపే.. అక్కడ ఉన్న ఇద్దరు పోలీసులు సదరు మహిళపై దాడి చేశారు. మహిళా పోలీసు అధికారి మహిళను పట్టుకుని ఉండగా.. పురుష అధికారి మాత్రం ఆమె చేయి పట్టి లాగి.. కాళ్లతో తంతూ.. సదరు మహిళపై పిడిగుద్దులు కురిపించాడు.పెద్దావిడ అనే కనికరం కూడా లేకుండా పోలీసులు చేస్తున్న ఈ అరాచకాన్ని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఖైదీలను కూడా ఇలా దారుణంగా హింసించరు అని కొందరు అంటుంటే.. మరికొందరు మాస్క్ పెట్టుకోనందుకు ఇంత ఓవరాక్షన్ చేయాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed