ఫోన్‌లో వచ్చిన మెసేజ్ చూసి తండ్రి షాక్.. అసభ్యకరమైన వీడియోలో తన కూతురు

by Sumithra |   ( Updated:2021-12-03 00:19:57.0  )
phone-message1
X

దిశ, వెబ్ డెస్క్: డబ్బుల కోసం కొంతమంది వ్యక్తులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందులో మహిళలతో పరిచయాలు పెంచుకుని వారిని నిలువునా మోసం చేస్తున్నారు. అంతేకాదు.. వారిని నమ్మినవారి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇటీవల ఇలాంటి ఘటనే యూపీలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన ఓ యువతికి 2019లో సోషల్ మీడియాలో ఆగ్రాకు చెందిన సన్నీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పట్నుంచి వారిద్దరూ ఫోన్ లో చాట్ చేసుకోవడం, మాట్లాడుకునేవారు. అయితే, ఇటీవల సన్నీ ఆగ్రా నుంచి లక్నోకు వచ్చాడు. అక్కడ ఓ హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ యువతికి ఫోన్ చేసి హోటల్ కు రమ్మన్నాడు. అతడిని నమ్మి హోటల్ కు వెళ్లిన ఆ యువతికి మాయమాటలు చెప్పి మత్తుమందిచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా కూడా వీడియో తీసి.. దాంతో ఎన్నోసార్లు బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను యువతి తండ్రికి పంపి రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed