ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ప్రొఫైల్‌తో మోసం

by Sumithra |
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ప్రొఫైల్‌తో మోసం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ప్రొఫైల్‌తో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుమంత్ అనే యువకుడు అమ్మాయిల ప్రొఫైల్ ఫోటోతో ఇన్‌స్టాగ్రా‌మ్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఫేక్ అకౌంట్‌తో యువతులతో చాటింగ్, వ్యక్తిగత ఫోటోలు సేకరించాడు. అనంతరం 70 మంది యువతులను బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఓ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సుమంత్ ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed