- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పుష్కరఘాట్ అత్యాచారం కేసులో కొత్త మలుపు
దిశ,వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ వద్ద జరిగిన అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ రేప్ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు యువకులు ఉన్నట్లు నిర్ధారణ కాగా యువతిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు.
కృష్ణ, వెంకటరెడ్డి అనే యువకులు అఘాయిత్యం చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారిద్దరిని బాధితురాలు గుర్తు పట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ ఘటనకు గోపితేజ, అయ్యప్ప, సురేష్‌లు సహకరించినట్లు సమాచారం కాగా మిగితా ముగ్గుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే యువతి నుంచి తీసుకున్న సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మొదటగా పట్టుకున్న నిందితులు కృష్ణ. వెంకటరెడ్డి ఇద్దరూ రైల్వేస్టేషన్లలో మహిళల మెడల్లోచి చైన్లు, అలాగే బ్యాగ్‌లు, పర్సులు దొంగతనం చేస్తుంటారు. అలా దొంగతనం చేయగా వచ్చిన డబ్బులతో గంజాయి, మద్యం సేవిస్తుంటారని చెబుతున్నారు.