కేంద్రం తప్పిదం వల్లే NEET కౌన్సెలింగ్ వాయిదా..!

by Sridhar Babu |   ( Updated:2021-10-26 08:14:03.0  )
కేంద్రం తప్పిదం వల్లే NEET కౌన్సెలింగ్ వాయిదా..!
X

దిశ, కరీంనగర్ సిటీ : కేంద్రం తప్పిదం, నిర్లక్ష్యం వల్లే సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా పడిందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు. మంగళవారం నగరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. నీట్ పీజీ ఆలిండియా కోటా సీట్ల భర్తీకి జూలై 29న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసిందని, ఈ సీట్ల భర్తీ ప్రక్రియలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం రిజర్వేషన్లు ఈ విద్యా సంవత్సరం అమలు చేయాల్సి ఉండగా, కొంతమంది సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో వాయిదా పడినట్టు తెలిపారు.

సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే ఇలా జరిగిందని మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీట్ల భర్తీ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. మరింత జాప్యం జరిగితే ఈ విద్యాసంవత్సరాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకొని వెంటనే కౌన్సెెలింగ్ జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమాఖ్య జాతీయ సలహాదారు పెండ్యాల కేశవ రెడ్డి, చెన్నమనేని పురుషోత్తం రావు, డా. దీపక్ బాబు, తీగల లక్ష్మణరావు, అండెం రమణారెడ్డి, బిరెడ్డి కర్ణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed