- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘భారత్‌లో విలీనానికి పీవోకే డిమాండ్ చేస్తది’
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరాల్లో జమ్ము కశ్మీర్‌లో మోడీ ప్రభుత్వం భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందనీ, వాటిని చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ప్రజలూ భారత్‌లో అంతర్భాగంగా ఉంటామని డిమాండ్ చేస్తారని అన్నారు. ఈ డిమాండ్‌లతోనే పీఓకే భారత్ అంతర్భాగమని పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టడానికి సులువవుతుందని తెలిపారు.
జమ్ము కశ్మీర్‌లో వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ ప్రసంగంలో ఆర్టికల్ 370 గురించీ ప్రస్తావించారు. అలాగే, చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ ఇప్పుడు బలహీనదేశం కాదని అన్నారు. దేశ ప్రతిష్టతకు ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం వాటిల్లనివ్వబోమని స్పష్టం చేశారు.
దేశ భద్రతలో బలాన్ని మరింత పెంచుకున్నామని తెలిపారు. అయితే, ఈ బలం వేరే దేశాలను భయపెట్టేందుకు కాదనీ, కేవలం దేశ భద్రత కోసమేనని వివరించారు. చైనాతో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు తొలిగిపోయేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మిలిటరీ, దౌత్య స్థాయి చర్చల ద్వారా దీనికి పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.