- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారీగా చేపలు మృత్యువాత.. విషప్రయోగం చేశారని అనుమానం?
X
దిశ, కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ మండలం చేరుకూరు గ్రామంలోని ఈదుల చెరువులో ఆదివారం భారీగా చేపలు మృత్యువాతపడ్డాయి. చెరువులో విషప్రయోగం జరిగిందని మండల మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై వెల్దండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘ఈదుల చెరువులో చేప పిల్లలు తెచ్చి వేశాము. ఇటీవల చేపలు పట్టే సమయంలో పెద్దాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చేపలు పట్టారాదని అడ్డుకున్నారు. ఇప్పుడు చూస్తేనేమో చేపలన్నీ చనిపోయి ఉన్నాయి. చేపలు పట్టకుండా ఆరోజు అడ్డుకున్న వారిపైనే అనుమానం ఉంది.’’ అని బాధితులు అనుమానితులపై ఫిర్యాదు చేశారు. దాదాపు 40 శాతం చేపలు చనిపోయినట్లు తెలిపారు. ఇకముందు ఇలాంటి చర్యలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.
Advertisement
Next Story