స్వయంగా మంత్రి మాటిచ్చినా ముందుకు కదలని పనులు

by Shyam |   ( Updated:2021-11-23 03:27:16.0  )
స్వయంగా మంత్రి మాటిచ్చినా ముందుకు కదలని పనులు
X

దిశ, ఘట్కేసర్: స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతాం అన్న పాలకుల హామీలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. పట్టణాభివృద్ధికి సరిపడ నిధులు అందుబాటులో ఉన్నాయని, సమస్యలు లేని పట్టణంగా మారుస్తామన్న అధికారుల మాటలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. దీంతో పోచారం మున్సిపల్ నారపల్లి ప్రజలు మురుగు నీటి సమస్యతో గత కొన్ని సంవత్సరాలుగా సతమతమవుతున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ అవుట్ లెట్ లేక 15వ వార్డ్ బాబానగర్, లైబ్రరీ కాలనీ, టీచర్స్ కాలనీలతో పాటు ఆయాకాలనీల్లో ఇండ్ల మధ్య మురుగునీరు నిలిచి ఉంటుంది. దీంతో దుర్గంధం వాసన వస్తుందని, భూగర్భ జలాలు కలుషితం కావడంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. విషయంపై స్థానిక నాయకులకు, అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని సమస్యను గుర్తించి త్వరితగతిన మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

స్థానిక ప్రజల వినతి మేరకు రాష్ట్ర కార్మికఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి స్వయంగా వచ్చి సమస్యను గుర్తించారు. అవసరమైన నిధులు కేటాయిస్తూ.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రతిపాదనలు చేసిన అధికారులు నిధులు లేవని అటకెక్కించారు. మంత్రి ఆదేశాలకే దిక్కు లేదంటే పట్టణ సమస్యలు ఏ మేరకు పరిష్కారం అవుతాయని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed