జలదిగ్భంధంలో గండి పోచమ్మ…

by srinivas |   ( Updated:2021-07-24 04:42:14.0  )
జలదిగ్భంధంలో గండి పోచమ్మ…
X

దిశ, ఏపీ బ్యూరో: గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ముంపు మండలమైన దేవీపట్నం జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. దేవీపట్నం పోచమ్మ గండి వద్ద ఉన్న గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. ఆలయం గోపురాన్ని వరద నీరు తాకింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని 30 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద గోదావరి నీటిమట్టం 30 మీటర్లకు చేరుకుంది. దీంతో ముంపు గ్రామాలపై తీవ్ర ప్రభావం పడిందని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story