వేటగాళ్లు అరెస్ట్

by Sumithra |
వేటగాళ్లు అరెస్ట్
X

దిశ,జుక్కల్: మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట యథేచ్చగా కొనసాగుతున్నది. తాజాగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సిర్ సముందర్ , హస్గుల్ గ్రామ శివారులో కృష్ణ జింకల వేట ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. జింకలను వేటాడి అమ్మేందుకు నిజామాబాద్ తీసుకుని వెళుతుండగా ఇద్దరు వేటగాళ్లను శుక్రవారం ఉదయం వర్ని పోలీసులు పట్టుకున్నారు. వారిని బీర్కుర్ మండలం వీరాపుర్ దుబ్బకు చెందిన కడమంచి సాయిలు, కప్పరి పెద్ద రాములుగా పోలీసులు గుర్తించారు. వారిని పిట్లం ఫారెస్ట్ రేంజ్ అధికారులకు పోలీసులు అప్పగించారు. వారి దగ్గర నుంచి జింకల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి అటవీ అధికారులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story