- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ నికర లాభం రూ. 257 కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ యాజమాన్య పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్(పీఎన్‌బీహెచ్ఎఫ్ఎల్) 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 10 క్షీణతతో రూ. 257.2 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 284.5 కోట్లను నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం 22 శాతం తగ్గి రూ. 487.8 కోట్లుగా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో నికర వడ్డీ మార్జి 2.66 శాతంగా ఉన్నట్టు తెలిపింది.
జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాహం 30 శాతం తగ్గి రూ. 404.6 కోట్లుగా ఉండగా, గతేడాది ఇదే కాలంలో రూ. 578.2 కోట్లుగా నమోదు చేసింది. మొత్తం రుణాలు 7 శాతం తగ్గి రూ. 67,283 కోట్లకు చేరుకోగా, డిపాజిట్ పోర్ట్‌ఫోలియో 5 శాతం పెరిగి రూ. 16,203 కోట్లకు చేరుకుంది. కేటాయించిన రుణాలు జూన్ 30 నాటికి రూ. 15,486 కోట్లుగా ఉన్నట్టు ఎక్స్ఛేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది.’ప్రస్తుత త్రైమాసికంలో కొవిడ్-19 కారణంగా పంపిణీపై గణనీయమైన ప్రభావాన్ని చూశామని, దీంతో గత 24 త్రైమాసికాల కాలంలో ఈసారి తక్కువగా ఉన్నట్టు’ పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో నీరజ్ వ్యాస్ తెలిపారు. కరోనాను అధిగమించి అన్ని శాఖలను తగిన జాగ్రత్తలతో నిర్వహిస్తున్నట్టు నీరజ్ వ్యాస్ పేర్కొన్నారు.