- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమ్మకానికి ప్రధాని మోడీ ఆఫీస్
దిశ, వెబ్‌డెస్క్: వారణాసిలో గల ప్రధాని నరేంద్ర మోడీ ఆఫీస్‌ను కొందరు దుండగులు ఓఎల్ఎక్స్‌లో వేలానికి పెట్టారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రకటన ఇచ్చిన నలుగురు వ్యక్తులను గుర్తించి, అరెస్ట్ చేశారు. కాగా.. ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను అమ్మకానికి పెట్టినందుకే ఇలా చేశారంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
వారణాసి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) అమిత్ పథక్ వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు వారణాసిలోని ప్రధాని కార్యాలయాన్ని ఓఎల్‌ఎక్స్‌లో రూ.7.5 కోట్లకు వేలం పెట్టారు. దీన్ని గుర్తించిన పలువురు స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఓఎల్ఎక్స్ నుంచి ఆ అడ్వర్టైజ్‌మెంట్‌ను తొలగించారు.
ఓఎల్‌ఎక్స్‌లో మోడీ ఆఫీస్ అమ్మకం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై నెటిజన్లు డిఫరెంట్ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ‘మీరు దేశాన్ని అమ్మండి.. మేము మీ ఆఫీస్ అమ్ముతామని’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ విషయం తెలుసుకుని తాము ఆశ్చర్యపోతున్నామని ఎమోజీలు పెడుతున్నారు. నిజంగానే అమ్మకానికి పెట్టారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.