‘లాక్‌డౌన్‌ 4.0’ పై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం

by Shamantha N |
‘లాక్‌డౌన్‌ 4.0’ పై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం
X

న్యూఢిల్లీ: ఈ నెల 18వ తేదీ తర్వాత అమల్లోకి రాబోతున్న ‘లాక్‌డౌన్ 4.0’ విధానాలు, నిబంధనలు, సడలింపులపై చర్చించేందుకు ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. సాధికారిక గ్రూపు చైర్‌పర్సన్‌లతో ఈ సమావేశాన్ని సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించబోతున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో క్యాబినెట్ మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌ సహా పలువురు పాల్గొనబోతున్నారని సమాచారం. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. నాలుగో దశ లాక్‌డౌన్.. కొత్త విధానంలో సాగుతుందని, సరికొత్త నిబంధనలుంటాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17తో మూడో దశ లాక్‌డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని రాష్ట్రాల నుంచి సూచనలు, అభిప్రాయాలను కోరారు. లాక్‌డౌన్ 3.0 తర్వాత ఏ వ్యూహాన్ని అనుసరించాలి అనే విషయంపై ఈ నెల 15లోపు రిపోర్టులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు. కాగా, 16వ తేదీన లాక్‌డౌన్ 4.0 గురించిన ప్రకటనలుంటాయని తెలుస్తోన్నది. ప్రధాని నిర్వహిస్తున్న ఈ ఉన్నత స్థాయి సమావేశం ఒకవైపు సాగుతుండగానే.. దీనికి అరగంట ముందే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీపై మాట్లాడటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed