కరోనా పరిస్థితులపై మోడీ సమీక్ష.. ‘లాక్‌డౌన్‌’పై నిర్ణయం.?

by Shamantha N |
కరోనా పరిస్థితులపై మోడీ సమీక్ష.. ‘లాక్‌డౌన్‌’పై నిర్ణయం.?
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల్లో మందులు, వ్యాక్సిన్ కొరతపై మోడీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. వెంటనే రాష్ట్రాలకు మందులు, వ్యాక్సిన్ అందజేయాలని ఆదేశించారు. వైద్య రంగానికి మౌళిక సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలే లాక్‌డౌన్‌పై నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే ప్రధాని మోడీ చెప్పిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి.

Advertisement

Next Story

Most Viewed