బ్రేకింగ్: కరోనాతో ప్రధాని మోదీ పిన్ని నర్మదాబెన్ మృతి

by Anukaran |   ( Updated:2021-04-27 11:36:53.0  )
బ్రేకింగ్: కరోనాతో ప్రధాని మోదీ పిన్ని నర్మదాబెన్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మోదీ పిన్ని నర్మదాబెన్ మోడీ(80) కరోనాతో మృతి చెందారు. కరోనాతో గత కొద్దిరోజులుగా అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుండగా.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ స్వయంగా వెల్లడించారు.

‘కరోనా సోకడంతో పది రోజుల క్రితం మా పిన్ని నర్మదాబెన్ సివిల్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఈ రోజు మరణించారు’ అని ప్రహ్లాద్ మోడీ తెలిపారు. దీంతో నర్మదాబెన్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

‘ప్రధాని మోదీ పిన్ని నర్మాదాబెన్ మృతికి సంతాపం ప్రకటిస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ అని బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య ట్వీట్ చేశారు. కాగా మోడీ తండ్రి దామోదర్ దాస్ సోదరుడైన జగ్జీవనదాస్ భార్యనే నర్మదాబెన్.

Advertisement

Next Story

Most Viewed