రెండో విడతలో ప్రధాని మోడీకి కరోనా టీకా..

by Anukaran |
రెండో విడతలో ప్రధాని మోడీకి కరోనా టీకా..
X

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్-19 టీకాల పంపిణీ ప్రారంభమై ఆరు రోజులు గడుస్తున్నది. డీజీసీఐ నుంచి అనుమతి పొందిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను ఇప్పటివరకు 7లక్షల మందికిపైగా పొందారు. త్వరలో రెండో దఫా టీకాల పంపిణీ ప్రారంభంకానున్నది. ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మొదటి దశలో వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రెండో దశలో 50ఏండ్లకు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు. టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ టీకా తీసుకోనున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed