- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త చట్టాలతోనే రైతులకు లబ్ధి: మోడీ
దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒప్పందానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. వర్చువల్‌గా ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లుగా భారత్‌పై ఉన్న విశ్వాసం గత కొన్ని నెలల్లోనే రెట్టింపు అయిందన్నారు. భారీగా విదేశి పెట్టుబడులు కూడా వచ్చాయన్నారు. ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇక భారత ప్రైవేట్ సెక్టార్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సాంకేతిక ఆధారిత పరిశ్రమలను శక్తివంతం చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
అనంతరం వ్యవసాయం, రైతులపై మాట్లాడిని మోడీ.. వారి ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాగు, అనుబంధ రంగాలకు మధ్య అడ్డుగోడలున్నాయని.. కొత్త చట్టాలతోనే అడ్డుగోడలన్నీ తొలగిపోయాయని చెప్పుకొచ్చారు. సాగు చట్టాలతో రైతులకు కొత్త మార్కెట్లు, అవకాశాలు లభిస్తాయని ఆకాంక్షించారు. అందుకే శీతలీకరణ సదుపాయాలను మరింత పెంపొందించాలని మోదీ చెప్పారు. సంస్కరణలో పెట్టుబడులు పెరిగి రైతులకు లబ్ధి చేకూరుతుందని మోడీ స్పష్టం చేశారు.