భారత్-అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేస్తా : మోడీ

by Shamantha N |   ( Updated:2020-12-22 10:26:48.0  )
భారత్-అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేస్తా : మోడీ
X

న్యూఢిల్లీ : భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నారని, అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డును అందివ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డుతో తనలో సంతోషాన్ని నింపిందని పేర్కొన్నారు. 21శతాబ్దం ఇరుదేశాల ముందు అనేక సవాళ్లను ఉంచిందని, ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం కలిసి పనిచేశామని ట్వీట్ చేశారు.

అమెరికాతో కలిసి పనిచేస్తామని, ఉభయ దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని 130 కోట్ల భారత జనాభా తరఫున చెబుతున్నట్టు పేర్కొన్నారు. అమెరికా మిలిటరీ ఉన్నత అవార్డుల్లో ఒకటైన లీజియన్ ఆఫ్ మెరిట్‌ను డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రధాని మోడీకి ప్రకటించారు. ఉభయదేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసిన ఇతర దేశాల నేతలకు సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ఈ అవార్డును ప్రకటిస్తుంటారు. ఈ అవార్డును ప్రధాని మోడీ తరఫున భారత దౌత్యాధికారి తరణ్‌జిత్ సింఘ్ సంధు వైట్‌హౌజ్‌లో సోమవారం స్వీకరించారు.

Advertisement

Next Story

Most Viewed