- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘ఇండియా గ్లోబల్ వీక్ 2020’’లో మోదీ ప్రసంగం
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ రేపు జరగబోయే ‘‘ఇండియా గ్లోబల్ వీక్ 2020’’ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ముఖ్యంగా ‘‘బీ ది రివైవల్: ఇండియా అండ్ ఏ బెటర్ న్యూ వరల్డ్’’ అంశంపై మూడు రోజులపాటు ఈ కార్యక్రమం వర్చువల్ విధానంలో జరగనున్నది. ఇండియా గ్లోబల్ వీక్ 2020 కార్యక్రమంలో 30 దేశాల నుంచి ఐదు వేలమంది పాల్గొంటారు. 75 సెషన్లలో 250 మంది ప్రసంగించనున్నారు.
భారత విదేశీ వ్యవహారాల మంత్రి డా.ఎస్.జైశంకర్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, జమ్ము,కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ను, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవిశంకర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్, యూకే విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్, భారత్‌లో అమెరికా రాయబారి కేన్ జస్టర్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ అంశంపై మధు నటరాజ్ తో ప్రత్యేక ప్రదర్శన, సితార్ విద్వాంసుడు పండిత్ రవిశంకర్ వందో జయంతి సందర్భంగా, ఆయన ముగ్గురు ప్రముఖ శిష్యులతో నివాళి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.