కరోనాపై పోరులో ప్రజలే సైనికులు: మోడీ

by Shamantha N |
కరోనాపై పోరులో ప్రజలే సైనికులు: మోడీ
X

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో ప్రజలే సైనికులనీ, ప్రజల సహకారంతోనే కరోనాను ఎదుర్కోగలుగుతున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి యావత్ భారతం ఒకే తాటిపైకి వచ్చిందనీ, ప్రతి పౌరుడూ ఓ సైనికుడిలా పోరాడుతున్నారని కొనియాడారు. ఎంతోమంది దాతలు నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ వైరస్‌పై పోరులో పెన్షన్‌ దారులు తమ పింఛన్లను సైతం త్యాగం చేశారని వెల్లడించారు. అలాగే, విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో బాధ్యతగా చొరవ తీసుకుంటున్నాయని తెలిపారు. తాను కూడా ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నానని చెప్పారు. ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌ను కొనసాగించాలనే కోరారనీ, ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కరోనా నియంత్రణకు పారిశుద్ద్య కార్మికులు, వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేయాలని ఆలోచించే ప్రతి ఒక్కరికీ వందనం చేస్తున్నానని చెప్పారు.

Tags: mann ki baat, PM modi, narendra modi, coronavirus, modi salutes, covid 19, lockdown

Advertisement

Next Story

Most Viewed