లక్మణ రేఖ దాటొద్దు: ప్రధాని మోడీ

by Shamantha N |
లక్మణ రేఖ దాటొద్దు: ప్రధాని మోడీ
X

దేశంలో తప్పని పరిస్థతుల్లో లాక్‌డౌన్ విధించాల్సి వచ్చిందని, ప్రతి ఒక్కరూ అందులో భాగస్వాములం కావాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం మన్ కీబాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ఆంక్షల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అందుకు తనను క్షమించాలని వేడుకొన్నారు. ముఖ్యంగా రెక్కాడితేడొక్కాడని రోజువారీ కూలీల పడుతున్న బాధల్ని తాను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. ప్రజలు తమని తాము కాపాడుకుంటూ తమ కుంటుంబాల్ని కూడా కాపాడుకోవడానికే లాక్‌డౌన విధించామని మోదీ స్పష్టం చేశారు.

సైనికులే స్ఫూర్తిగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవం నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. మరికొన్ని రోజుల పాటు లక్ష్మణరేఖ దాటకుండా ఉండాల్సిందేనని ప్రధాని తేల్చి చెప్పారు. ఈక్రమంలో ప్రతి ఒక్కరూ ధైర్యంతో కరోనాతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం కోసం పోరాడుతున్న సైనికులను స్ఫూర్తిగా తీసుకున్నామని, వైరస్ నియంత్రంణకు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కృషి అమోఘమని కొనియాడారు. ప్రజలంతా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఇది జీవన్మరణపోరు..

దేశంలో వైరస్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాన్ని జీవన్మరణ పోరుగా ప్రధాని అభివర్ణించిన ప్రధాని.. కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. క్వారంటైన్, సామాజిక దూరం పాటించని దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో, దీనిని ప్రజలంతా దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.

ప్రజల భద్రత మేరకే..

దేశ ప్రజల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా బారినపడ్డ రామగంపా తేజ అనే బాధితుడు ప్రధానితో తన అనుభవాన్ని పంచుకున్నాడు. వైరస్ గురించి తాను తొలుత భయపడ్డాను, కానీ, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తనకు భరోసా ఇచ్చారని తెలిపాడు. కరోనా బారిన పడ్డ ఆగ్రాకు చెందిన అశోక్ కపూర్ ప్రధానితో మాట్లాడుతూ తమ కుటుంబంలోని ఓ వ్యక్తి ఇటలీ వెళ్లొచ్చాడని, అక్కడే వైరస్ సోకిందని తెలిపాడు. అనంతరం మిగితా వారందరికీ సోకిందని చెప్పాడు.

tags;pm modi, manki bat,should contribute lockdown,Soldiers inspire us

Advertisement

Next Story

Most Viewed