బిగ్ బ్రేకింగ్ : మోడీ ప్రభుత్వం మరో సంచలనం.. ఓనర్ షిప్ రైట్స్ మాత్రం కేంద్రానివే..!

by Shamantha N |   ( Updated:2021-08-23 07:33:23.0  )
బిగ్ బ్రేకింగ్ : మోడీ ప్రభుత్వం మరో సంచలనం.. ఓనర్ షిప్ రైట్స్ మాత్రం కేంద్రానివే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు మరోసారి రంగం సిద్ధం చేసింది. ఇదివరకే నిధుల సేకరణ కోసం కొన్ని కీలక ప్రభుత్వ రంగాల్లో వాటాలు విక్రయించిన విషయం తెలిసిందే. తాజాగా భారీ నిధుల సేకరణే లక్ష్యంగా నిర్దిష్ట కాలానికి వాటాలు అమ్మాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు.

రైల్వే, రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్ పైప్ లైన్ల రంగాల్లో ఆస్తుల అమ్మకంతో రూ.6 లక్షల కోట్ల నిధులు సమీకరించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ కార్యక్రమాన్ని నిర్మలాసీతారామన్ ప్రకటించారు. అయితే, ఈ రంగాల్లో వాటాలు విక్రయించినా యాజమాన్య హక్కులు మాత్రం కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టంచేశారు. కరోనా కష్టకాలంలో కేంద్రం భారీస్థాయిలో ఆదాయం కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో పాటు ‘ఆత్మనిర్మర్ భారత్ పథకం’ కింద దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి వ్యాపార వేత్తలకు, పరిశ్రమలకు అందించిన సాయం వల్ల కలిగిన రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించేందుకు మొగ్గుచూపినట్టు కేంద్రం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed