మన సరిహద్దులు సేఫ్..ఎల్‌ఏసీ పై నిఘా కఠినతరం: మోడీ

by Shamantha N |
మన సరిహద్దులు సేఫ్..ఎల్‌ఏసీ పై నిఘా కఠినతరం: మోడీ
X

న్యూఢిల్లీ: భారత సరిహద్దులు సేఫ్‌గా ఉన్నాయని, ఎవరూ అక్రమంగా చొరబడలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్ పార్టీ మీట్‌లో వివిధ పార్టీల నేతలు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.భారత్‌కు చెందిన ఏ సైనిక పోస్టులనూ ఏ దేశమూ స్వాధీనం చేసుకోలేదని మరోసారి స్పష్టం చేశారు. భారత్‌కు చెందిన అంగుళం భూమి కూడా ఎవ్వరూ కబ్జా చేయకుండా సైన్యం పహారా కాస్తుందన్నారు. దేశ రక్షణ కోసం సైన్యం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని చెబుతూనే సైన్యానికి, వైమానిక దళానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ వైపు ఎవరూ కన్నెత్తి చూడలేరని ప్రధాని సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. డ్రాగన్ కంట్రీ తీరు వలన భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కట్టలు తెచ్చుకుంటున్నాయని వివరించారు.తాజా ఘటన నేపథ్యంలో వాస్తవాధీన రేఖపై పూర్తి నిఘా పెట్టామన్నారు. భారత్ వద్ద ఫైటర్ జెట్లు, కొత్త హెలికాఫ్టర్లు ఉన్నాయని, అయినా భారత్ శాంతిని కోరుకుంటుందన్నారు. అవసరమైతే దేశ సార్వభౌమత్వంపై రాజీ పడబోదని చెప్పారు. జాతి హితమే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు.

ఇదిలాఉండగా గల్వాన్ లోయలో చైనా బలగాలు కుట్రపూరితంగా దాడి చేసి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకోవడంపై కేంద్రం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో వివిధ ప్రతిపక్ష, విపక్ష నేతల ఇచ్చిన సలహాలు, సూచనలను కేంద్రం స్వీకరించింది. అదే సమయంలో గల్వాన్ లోయ వద్ద చోటుచేసుకున్న పరిణామాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వివిధ పార్టీల నేతలకు వివరించారు. సోనియా గాంధీ అడిగిన ప్రశ్నకు బదులుగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమీ లేదని, సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉందని రాజ్‌నాధ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed