- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగు చట్టాలపై విపక్షాల కల్పిత కథలు : మోడీ
న్యూఢిల్లీ : రైతులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంభాషిస్తూ విపక్షాలను టార్గెట్ చేశారు. సాగు చట్టాలపై విపక్షాలు కల్పితాలు, కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయని, అవాస్తవాలతో అన్నదాతలను తప్పుదారి పట్టిస్తున్నాయని అన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్‌తో రైతులు భూములు కోల్పోతారని అబద్ధాలు చెబుతున్నాయని మండిపడ్డారు. దివంగత పీఎం అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి రోజున(ఈ నెల 25న) ప్రధాని మోడీ ఎంపిక చేసిన ఆరు రాష్ట్రాల రైతులతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం కింద తదుపరి విడత నిధులు రూ. 18వేల కోట్లను విడుదల చేశారు.
రైతు ప్రయోజనాలకు బెంగాల్ ప్రభుత్వం మోకాలడ్డు..
రైతులతో మాట్లాడుతూ ప్రధాని మోడీ బెంగాల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బెంగాల్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసే నిధులను రైతులకు అందనివ్వకుండా మోకాలడ్డుతోందని అన్నారు. అన్ని రాష్ట్రాలు భిన్న రాజకీయ భావజాలాలున్న ప్రభుత్వాలు పీఎం కిసాన్ పథకానికి అనుమతినిచ్చాయని, కేంద్రం విడుదల చేస్తున్న రూ. 6000లను అందిస్తున్నాయని, కానీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం ఈ పథకానికి అమలు చేయకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఎలాంటి చెల్లింపులు జరపాల్సిన అవసరం లేకున్నా పథకాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అలాంటి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చేస్తున్న పంజాబ్ రైతులకు మద్దతు ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, సొంత ఎజెండా కోసం ఆందోళనలకు మద్దతునిస్తున్నాయని పేర్కొన్నారు. పంజాబ్ రైతుల గురించి ఆలోచనలు చేస్తున్న విపక్షాలు కేరళలో ఏపీఎంసీలు లేవన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోవని ప్రశ్నించారు.
ఒడిశా రైతుతో మాట్లాడుతూ, కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి ఇతర కర్షకులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్డులు స్వల్ప మిత్తితో రుణాలు అందిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఢిల్లీలోని కిషన్‌గఢ్‌కు చెందిన రైతుతో షా మాట్లాడుతూ, కనీస మద్దతు ధర ఎప్పట్లాగే కొనసాగుతుందని, వ్యవసాయ మార్కెట్లను మూసేయబోమని, కార్పొరేట్లూ రైతుల భూములను లాక్కోవని వివరించారు. ప్రతిపక్షాలు అసత్యాలు వ్యాపింపజేస్తున్నాయని ఆరోపించారు. రైతులపట్ల ప్రభుత్వానికి అమిత గౌరవమున్నదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కొత్త చట్టాలు ఒక సంవత్సరం అమలైతే ఏవైనా లోపాలుంటే వెలికివస్తాయని, అప్పుడు మరిన్ని సవరణలు చేస్తామని వివరించారు. రైతులు చర్చలకు రెడీ కావాలని అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు కోరారు.