- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బల్దియా మీటింగ్‌లో మొక్కల పంచాయితీ
దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పాలకవర్గ సమావేశాలకు గందరగోళాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలపడం.. వారిని నిలువరించేందుకు అధికార పక్ష సభ్యులు ప్రయత్నించడంతో సమావేశంలో గందగోళం నెలకొనడం రివాజుగా మారింది. కరీంనగర్ కార్పొరేషన్ సమావేశం బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా మర్రి భావన అనే కార్పొరేటర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తన డివిజన్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోయాయని మేయర్‌కు చూపించారు. వాటిని కాపాడేందుకు చర్యలు ఎందుకు చేపట్టలేదని మండిపడ్డారు. దీంతో టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా పోడియం వద్దకు వచ్చి ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీ సభ్యుల మధ్య మాటా మాటా పెరగడంతో ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో మేయర్ యాదగిరి సునీల్ రావు బీజేపీ కార్పొరేటర్లపై ఫైర్ అయ్యారు. మేయర్ సునీల్ రావు వాడిన పదజాలం బాగలేదంటూ బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపున టీఆర్ఎస్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ పోడియం వద్ద బీజేపీ సభ్యుల ఆరోపణలకు కౌంటర్ అటాక్ చేశారు. బీజేపీ నాయకులు చెట్లను నరికించారని తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ కార్పోరేటర్లు శ్రీకాంత్ ఆరోపణలను ఖండించడంతో ఇరు పార్టీ నాయకుల మధ్య వాదోపవాదాలు సాగాయి.