- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మదనపల్లి ‘మర్డర్’ సీన్ రిపీట్.. పిల్లల నరబలికి ప్లాన్
దిశ, వెబ్ డెస్క్ : మూఢవిశ్వాసాల కారణంగా అమాయకుల ప్రాణాలు ఇంకా బలవుతూనే ఉన్నాయి. మదనపల్లి ఘటన మరవక ముందే తమిళనాడులో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగంపాళ్యం రైల్‌నగర్‌కు చెందిన రామలింగం(42), రంజిత(32) దంపతులకు.. దీపక్ (15), కిషాంత్ (6) ఇద్దరు కుమారులు ఉన్నారు. రామలింగం ఆ ప్రాంతంలో చీరల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో రామలింగానికి.. ఇందుమతి అనే మహిళతో రెండో వివాహం జరిగింది. అనంతరం, ఆమెను కూడా అదే ప్రాంతంలోకి తీసుకొచ్చి వేరే ఇంట్లో ఉంచాడు.
ఈ క్రమంలో ఇందుమతి స్నేహితురాలు ధనలక్ష్మి (38) అప్పుడప్పుడు వీరి ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఇదే సమయంలో మొదటి భార్య రంజితతో ధనలక్ష్మికి పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల గడిచాక.. వారిద్దరిని చూసి రామలింగం.. మీరిద్దరూ శివుడు, పార్వతిలా ఉన్నారని కామెంట్స్ చేసేవాడు. కాలక్రమేణ వీరి పరిచయం పెరిగి.. తాము పెళ్లి చేసుకుంటామని రంజిత, ధనలక్ష్మి తెలపగా రామలింగం ఓకే చెప్పాడు. దీంతో రామలింగం.. ఇంట్లోనే తన కుమారుల ఎదుటే వారిద్దరికీ వివాహం చేశాడు.
వాళ్లు పెళ్లి చేసుకున్నాక.. అతీతశక్తులు వస్తాయనే నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేశారు. శారీరకంగా కూడా వారిని హింసించాడు. అతీత శక్తుల కోసం చివరికి వారిని నరబలి ఇచ్చేందుకు ముగ్గురు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లలు, వెంటనే తమ తాత ఇంటికి పారిపోయి జరిగిన విషయాన్ని చెప్పారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.