- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిత్యామీనన్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు.. నీ నుంచి ఇది ఊహించలేదంటూ ఫైర్..(వీడియో)
దిశ, సినిమా: ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిత్యమీనన్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, తమిళం వంటి భాషా చిత్రాల్లో కూడా నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే ఈ భామ ‘అలా మొదలైంది’ సినిమాలో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, అబ్బబ్బో.. అబ్బో.. అంటూ రెండు పాటలను పాడి సింగర్‌గా కూడా పరిచయం అయింది.
అలా ఓ పక్కా యాక్టింగ్ చేస్తూ మరోపక్క పాటలు పాడుతూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ్‌లో జయం రవితో కలిసి ‘కాదలిక్క నేరమిల్లై’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో పీఆర్‌ఓ స్టేజ్‌పై చేయి అందించగా.. అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిత్య ఇష్టపడలేదు. జస్ట్ నమస్కారం చేసి సరిపెట్టుకుంది. అయితే కొన్ని నిమిషాలకు ముందు ఈ భామ దర్శకుడు మిష్కిన్‌ను బుగ్గపై ముద్దుపెట్టుకుని, నటుడు జయం రవిని హగ్ చేసుకుంది. దీంతో ఆమె తీరుపై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. అసలు నీ నుంచి ఇది ఊహించలేదని ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.