Gutta Jwala: తన భార్య వైపు ఎందుకు చూడకూడదు? ఎల్అండ్‌టీ చైర్మన్ వ్యాఖ్యలపై గుత్తా జ్వాల ఫైర్

by Ramesh N |
Gutta Jwala: తన భార్య వైపు ఎందుకు చూడకూడదు? ఎల్అండ్‌టీ చైర్మన్ వ్యాఖ్యలపై గుత్తా జ్వాల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదివారాలు కూడా ఉద్యోగులు ఇంట్లో భార్య ముఖం చూస్తూ కూర్చోకుండా, ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ చైర్మన్ (L&T chairman SN Subramanyan) ఎస్ఎన్ సుబ్రమణ్యన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలపై సెలబ్రీటీలు, ప్రముఖులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ కమ్రంలోనే ఇవాళ ఎక్స్ వేదికగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల (Jwala Gutta) రియాక్ట్ అయ్యారు.

ముందుగా అతను తన భార్య వైపు ఎందుకు చూడకూడదు.. కేవలం ఆదివారం మాత్రమే ఎందుకు చూడాలి? అంటూ ప్రశ్నించారు. అంత చదువుకున్నవారు, పెద్ద సంస్థల అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు మానసిక ఆరోగ్యం, మానసిక విశ్రాంతిని సీరియస్‌గా తీసుకోకపోవడం ఏమిటని గుత్తా జ్వాల అశ్చర్యపోయారు. మరోవైపు ఇలాంటి స్త్రీ ద్వేషపూరిత ప్రకటనలు చేయడం, తమను తాము బహిరంగంగా బహిర్గతం చేసుకోవడం విచారకరమన్నారు. ఆ స్టేట్‌మెంట్ నిరాశపరిచిందని మరోవైపు భయానకంగా కూడా ఉందని ఎక్స్ వేదికగా (Jwala Gutta) ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed