- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Lokesh:‘నా భార్యను మీరే ఆదుకోవాలి’.. ట్వీట్‌కు నారా లోకేష్ క్విక్ రియాక్షన్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా(Social Media)లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ప్రత్యక్షంగా తనను కలిసి అందించిన వినతులు, ఫిర్యాదులనే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చే సమస్యలను కూడా మంత్రి లోకేష్(Minister Nara Lokesh) వెంటనే స్పందిస్తూ పరిష్కరిస్తుంటారు. ఈ నేపథ్యంలో పలువురు తమ సమస్యలను సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ దృష్టికి తీసుకు వస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న మహిళకు మంత్రి నారా లోకేష్ సాయం అందించి అండగా నిలిచారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన 38 ఏళ్ల ఎమ్.స్వర్ణ దుర్గ గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. వైద్యం కోసం ఆస్పత్రిని సంప్రదించగా.. చికిత్స నిమిత్తం సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అయింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తమకు సీఎంఆర్ఎఫ్(CMRF) ద్వారా సాయం అందించి ఆదుకోవాలని భర్త మాదల చంద్రశేఖర్ ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ ను విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2,51,075 చెక్కును అందజేసి వారి కుటుంబానికి తోడ్పాటును అందించారు. సమస్యను సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన వెంటనే స్పందించి ఆదుకున్న మంత్రి నారా లోకేష్ కు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.