Yadagirigutta : యాదగిరిగుట్టలో వైభవంగా ఉత్తర ద్వార దర్శనం

by Y. Venkata Narasimha Reddy |
Yadagirigutta : యాదగిరిగుట్టలో వైభవంగా ఉత్తర ద్వార దర్శనం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(Sri Lakshmi Narasimha Swamy Temple)లో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారి ఉత్తర ద్వార(Northern Gate) దర్శనం వేడుక వేలాది మంది భక్త జనం మధ్య వైభవంగా సాగింది. వేకువ జామున 5: 30గంటలకు స్వామివారు ఆలయ ఉత్తర రాజగోపురం నుంచి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి చలిని సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన భక్తులు ఉత్తర రాజగోపురం నుంచి శ్రీవారు దర్శనం లభించగానే గోవింద నామస్మరణలతో భక్తీ పారవశ్యంతో పులకించారు. భక్తుల గోవింద నామస్మరణలు, నామో నారసింహ స్మరణలతో యాదగిరి కొండ ప్రతిధ్వనించింది. స్వామివారి ఉత్తర ద్వారా దర్శనానికి స్థానిక ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్, జడ్చర్ల ఎమ్మల్యే అనిరుధ్ రెడ్డిలు హాజరయ్యారు.

ఉత్తర ద్వార దర్శనానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు దేవస్థానం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఇబ్బంది కల్గకుండా లక్షపుష్పార్చన, ఆర్జిత సేవలు రద్దు చేశారు. దేవస్థానంలో నేటి నుంచి ఈనెల 15 వరకు అధ్యయనోత్సవాలు కొనసాగనున్నాయి. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజుల పాటు ఉదయం, సాయంత్రం పలు అలంకారాల్లో శ్రీలక్ష్మీ నరసింహుడు దర్శనమివ్వనున్నారు.

Advertisement

Next Story

Most Viewed