Pisasu 2 : బాత్ టబ్ లో నగ్నంగా సిగరెట్ తాగుతున్న స్టార్ హీరోయిన్..

by Shyam |   ( Updated:2021-08-04 04:06:23.0  )
Pisasu 2 :  బాత్ టబ్ లో నగ్నంగా సిగరెట్ తాగుతున్న స్టార్ హీరోయిన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం హీరోయిన్లందరూ లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపే మొగ్గుచూపుతున్నారు. హీరోల పక్కన 5 నిమిషాలు కనిపించడం కన్నా రిస్క్ చేసి సినిమా మొత్తం కనిపించడానికే రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్లు సైతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సై అని విజయాలను అందుకున్నారు. ఇక తాజాగా వారి లిస్ట్ లోకి చేరిపోయింది కోలీవుడ్ హాట్ బ్యూటీ ఆండ్రియా జెరెమియా. కోలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మిస్కిన్ దర్శకత్వం వహించిన ‘పిశాసు’ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో ఈ చిత్రాన్ని తెలుగులో ‘పిశాచి’ పేరుతో డబ్ చేశారు. ఇక్కడ కూడా ఈ చిత్రం విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా ”పిశాసు 2” చిత్రాన్ని రూపొందిస్తున్నారు మిస్కిన్. ఈ మూవీలో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘డిటెక్టివ్’, ‘గృహం’ సినిమాలలో ఆండ్రియా నటించగా.. మూడోసారి “పిశాసు 2” లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో బాత్ టబ్ లో పడుకొని ఉన్న ఓ యువతి సిగరెట్ తాగుతూ బయట కాళ్లు వేలాడేసి కనిపిస్తోంది. ఆండ్రియా ఫేస్ చూపించకపోయినా ఆమె నగ్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో ఆండ్రియా నగ్నంగా నటించిందని సమాచారం. హారర్ సన్నివేశాల్లో ఆండ్రియా నటన అందర్నీ ఆకట్టుకోనుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ‘పిశాసు 2’ చిత్రంలో పూర్ణ,సంతోష్ ప్రతాప్, అజ్మల్ అమీర్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి మరియు ‘సైకో’ ఫేమ్ రాజ్ కుమార్ పిచ్చుమణి అతిథి పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.

Advertisement

Next Story