- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రేగా కాంతారావు దేవుడు.. మా దేవుడి జోలికి వస్తే మాటలు ఉండవ్..’
దిశ, మణుగూరు: పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు రోజు రోజుకి మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోందని పినపాక ప్రజలు గుసగుస లాడుతున్నారు. బుధవారం మణుగూరు టీఆర్ఎస్ పార్టీ మండల కో-ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. పినపాక ప్రజలకి దేవుడు ఒక్క రేగా కాంతారావు అంటూ.. ప్రతి ఇంట్లో ఫోటోను పెట్టుకొని పూజిస్తున్నారని.. టీఆర్ఎస్ పార్టీని గాని, పినపాక ఎమ్మెల్యేను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో మండలానికి ముగ్గురు దొంగలు ఉన్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బ్యాంక్ దొంగతనాలు, ఇసుక ట్రాక్టర్ దందాలు, గుప్తనిధుల పనులు చేసినవారు ఉన్నారంటూ విమర్శించారు. అటువంటి వారు ఈరోజు ఎమ్మెల్యే రేగాను విమర్శించే దమ్ము ఉందా అంటూ సవాల్ విసిరారు. మరోసారి రేగా జోలికి వస్తే మాటలు ఉండవ్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.