- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16 నెలల తర్వాత ఫిజికల్‌గా.. కరోనా తర్వాత ఇదే తొలిసారి
దిశ, తెలంగాణ బ్యూరో : వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్న జీఎస్టీ కౌన్సిల్ 16 నెలల తర్వాత తొలిసారి ఫిజికల్‌గా సమావేశం కానున్నది. కరోనాకు ముందు గతేడాది మార్చి 14న ఢిల్లీలో ఫిజికల్‌గా సమావేశం జరిగిన తర్వాత మళ్లీ ఆ రూపంలో జరగడం ఇదే ప్రథమం. లక్నో నగరంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో మొదటి రోజున అధికారుల స్థాయి సమావేశం ఈ నెల 16న జరగనున్నది. మరుసటి రోజు (సెప్టెంబరు 17న) ఆర్థిక మంత్రులు, కేంద్ర ఆర్థిక మంత్రితో కూడిన కౌన్సిల్ సమావేశం జరగనున్నది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ఎజెండా ఖరారైంది. సమావేశానికి రెండు, మూడు రోజుల ముందు తుది ఎజెండా ఖరారు కానున్నది.
సుదీర్ఘకాలం తర్వాత ఫిజికల్ మీటింగ్ నిర్వహిస్తున్నందువల్ల ప్రతీ రాష్ట్రం నుంచి మంత్రితో పాటు అదనంగా ఇద్దరు అధికారులను మాత్రమే కౌన్సిల్ నిర్వాహకులు హాజరుకావాల్సిందిగా షరతు విధించారు. ఎక్కువ మంది రావడం ద్వారా కరోనా నిబంధనలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ పరిమితి విధించుకోవాల్సి వచ్చిందంటూ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆ శాఖ కార్యదర్శులకు నిర్వాహకులు లేఖ రాశారు.