కరోనా రోగులంటే ఇంత చులకనా..?

by Anukaran |   ( Updated:2021-05-12 11:26:37.0  )
కరోనా రోగులంటే ఇంత చులకనా..?
X

దిశ, జడ్చర్ల : కరోనా టెస్టులు చేయించుకొని పాజిటివ్ వచ్చిన రోగులను కుక్కలకన్నా హీనంగా చూస్తూ వారికి గౌరవంగా అందించాల్సిన మందులను ఆసుపత్రి ఆవరణలో పడేసి తీసుకోవాల్సిందిగా కరోనా పేషెంట్లను సూచిస్తున్నారు. ఈ అమానుష ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజువారీ తంతుగా జరుగుతుంది. మేడ్చల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ అయిన పేషంట్‌ల పరిస్థితి దయనీయంగా మారింది. పేషెంట్లకు ధైర్యం చెప్పి మందులు నేరుగా చేతికిచ్చి ఏ మందులు ఏ సమయంలో ఎలా వేసుకోవాలో సూచించాలని నిబంధనలు ఉన్నాయి.

కానీ మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న బాలు అనే వ్యక్తి కరోనా పేషెంట్లను అగౌరవపరుస్తూ, ఆస్పత్రి ఆవరణలో మందులను పడేసి ఈ మందులు తీసుకొని వాడాల్సిందిగా సూచిస్తూ తన పైశాచికాన్ని చూపిస్తూ మానవత్వాన్ని మంట కలుపుతున్నాడు. ఇలా కరోనా పేషెంట్లను అవమానపరుస్తూ హీనంగా చూస్తున్నడంపై రోగులు, ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాసిస్ట్ బాలుపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇకపైన ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చూడాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed