- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. జూలై నుంచి భారత్‌కు..
న్యూఢిల్లీ : అమెరికా టీకాలు త్వరలో భారత్‌కు ఎంటరయ్యే అవకాశాలున్నాయి. ఫైజర్ సంస్థ ఐదు కోట్ల డోసులను(జూలైలో ఒక కోటి, ఆగస్టులో ఒక కోటి, సెప్టెంబర్‌లో రెండు కోట్లు, అక్టోబర్‌లో ఒక కోటి డోసులు) అందించడానికి సూత్రప్రాయంగా సంకేతమిచ్చినా, అందుకు భారీ మినహాయింపులను కోరుతున్నట్టు తెలిసింది. గతేడాది చివరిలో అత్యవసర అనుమతికి దరఖాస్తు చేసుకుంటే భారత రెగ్యులేటరీ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
తాజాగా, టీకాను అందిస్తాం కానీ, ట్రయల్స్ నుంచి, టీకాపై సెంట్రల్ డ్రగ్స్ ల్యాబరేటరీ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని, కేవలం కంపెనీ ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకుని అనుమతివ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, ఈ టీకా వేసుకున్న వ్యక్తికి సమస్యలు ఎదురైతే నష్టపరిహారం నుంచీ మినహాయింపునివ్వాలని కోరినట్టు తెలిసింది. మొడెర్నా సంస్థ భారత్‌కు అందించడానికి అదనపు టీకాలు లేవని, అయితే, సింగిల్ డోసు టీకాలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఇందుకోసం భారత ఫార్మా సంస్థ సిప్లా ద్వారా చర్చలు జరుపుతున్నది. 2022లో ఐదు కోట్ల డోసులను సేకరించడానికి సిప్లా ఆసక్తి చూపించినట్టు సమాచారం.